| 
Saturday, November 14, 2026
Homeతాజా వార్తలుడ్రగ్స్ వినియోగంతో ఒక వ్యక్తి జీవితం కాదు మొత్తం వ్యవస్థకే పెను ముప్పు. ప్రజాస్వామ్యం...

డ్రగ్స్ వినియోగంతో ఒక వ్యక్తి జీవితం కాదు మొత్తం వ్యవస్థకే పెను ముప్పు. ప్రజాస్వామ్యం లో ఓటు మన వజ్రాయుధం, యువత ఓటు హక్కును వినియోగించుకోవాలి. జిల్లా సంక్షేమ అధికారి మరియు SVEEP నోడల్ ఆఫీసర్ EP. ప్రేమలత.

📰 Generate e-Paper Clip

వెంకటాపురం నుగురు నవంబర్ 13 డెమోక్రసీ రైట్స్ ప్రతినిధి

 

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని CAFED స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో సంస్థ డైరెక్టర్ బ్రదర్ లూర్దు రాజ్ గారి అధ్యక్షతన యువతకు డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ,అవగాహన కార్యక్రమం మరియు అథ్లెటిక్స్ నిర్వహించడం జరిగింది.

 

ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి & SVEEP నోడల్ ఆఫీసర్ EP ప్రేమలత ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ తో ఒక వ్యక్తి జీవితం కాదు,మొత్తం వ్యవస్థకే పెను ముప్పు అని అన్నారు.నేడు సమాజంలో జరిగే చాలా రకాల హింసకు కారణం డ్రగ్స్,మత్తు మరియు మాదక ద్రవ్యాల వినియోగమే అని తెలిపారు.డ్రగ్స్ కి బానిసలైన వారు మానవత్వం మరిచి క్రూరంగా ప్రవర్తిస్తారని అన్నారు. నేటి యువతరమే దేశ భవిష్యత్తుకు పట్టుకొమ్మలు కావున యువతరం శారీరక శ్రమ, ఆరోగ్యవంతమై జీవన శైలి తోనే నిండు భవిష్యత్తును పొందాలని,తద్వారా క్రమ శిక్షణ,పట్టుదల మరియు అంకితభావం గల యువతను కలిగి ఉన్న దేశంగా మనదేశ కీర్తిని ప్రపంచానికి చాటాలని సూచించారు.

 

అనంతరం SVEEP అవగాహనలో భాగంగా ప్రజాస్వామ్యంలో ఓటు మన వజ్రాయుధమని, ఓటు హక్కు ప్రాముఖ్యత, సమాజ అభివృద్ధిలో ఓటు ప్రాధాన్యం,సక్రమం ఓటు వినియోగంలో యువత పాత్ర గూర్చి వివరించారు. ఓటు అర్హత వయస్సున్న ప్రతీ యువతీ యువకుడు ఓటరు నమోదు చేసుకోవాలని,అలాగే ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్క యువతీ,యువకులు ఓటు హక్కులను వినియోగించుకోవాలని సూచించారు.యువత తలుచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు కావున ఓటు హక్కును వినియోగించుకొని సమర్థమైన నాయకత్వాన్ని ఎన్నుకుని దేశ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

 

అనంతరం ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన కాఫెడ్ సంస్థ డైరెక్టర్ బ్రదర్ లూర్దు రాజ్ గారు మాట్లాడుతూ ఈ సమాజ దిశ,దశను మార్చే అద్వితీయమైన శక్తి యువతరానికి ఉందని, అలాంటి యువతరం మత్తు, మాదక ద్రవ్యాల మాయలో పడి తమ జీవితాలను నాశనం చేసుకోకుండా వారికి సరైన మార్గనిర్దేశం చేయడం కోసం మా కాఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో వెంకటాపురం & వాజేడు మండలాలనుండి విచ్చేసిన యువకులకు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే యువత మత్తు వైపు కాకుండా క్రీడలవైపు దృష్టి సారించి క్రీడా స్పూర్తితో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే సందేశంతో క్రీడా పోటీలను కూడా ఈ కార్యఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.

 

అనంతరం స్థానిక వెంకటాపురం ICDS ప్రాజెక్టు CDPO మరియు బాల్య వివాహ నిరోధక అధికారి R. ఇందిరమ్మ బాల్య వివాహా నిషేధ చట్టం – 2006 లోని అంశాలను వివరించి బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మిద్దామని కోరారు.

 

చివరగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం ములుగు నుండి విచ్చేసిన ప్రొటెక్షన్ ఆఫీసర్ N. హరికృష్ణ మాట్లాడుతూ POCSO చట్టం – 2012 లోని అంశాలను సంపూర్ణంగా వివరించారు. యువత మైనర్ పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలి అనే విషయాలను తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ యువకులుగా మన సామాజిక బాధ్యతని, చిన్నారులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి కాల్ చేయాలని సూచించారు.

 

అనంతరం నిర్వహించిన వివిధ క్రీడల్లో విజేతలైన జట్లకు క్రీడా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బ్రదర్ జయరాజ్

మరియు ఫాదర్ జోజప్ప చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో కాఫెడ్ సంస్థకి చెందిన వెంకటాపురం & వాజేడు మండలాల ఎన్యూమరేటర్లు మరియు సిబ్బంది, వెంకటాపురం & వాజేడు మండలాలనుండి విచ్చేసిన 400 పైగా మంది యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install DEMOCRACY RIGHTS App

Add to home screen for faster loading and latest updates.