| 
Saturday, November 14, 2026
Homeతాజా వార్తలుదళితుల భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేసి పట్టాలు ఇవ్వాలి తహసిల్దార్ కి వినతి...

దళితుల భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేసి పట్టాలు ఇవ్వాలి తహసిల్దార్ కి వినతి పత్రం అందించిన ములుగు జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ కోట నరేంద్ర తేజ

📰 Generate e-Paper Clip

వెంకటాపురం నుగురు నవంబర్ 13 డెమోక్రసీ రైట్స్ ప్రతినిధి రవి

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సర్వేలో వెంకటాపురం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో తాతల,ముత్తాతల కాలం నుండి నివసిస్తున్న దళితుల భూములను కూడా క్షేత్రస్థాయిలో సర్వే చేసి,పట్టాలు కల్పించాలని కోరుతూ ములుగు జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ కోట నరేంద్ర తేజ వెంకటాపురం తహసీల్దార్ వేణుగోపాల్ కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కోట నరేంద్ర తేజ మాట్లాడుతూ…

“మేము తాతల,ముత్తాతల కాలం నుండి ఇక్కడే నివసిస్తున్న దళితులం.17 యాక్ట్ ప్రకారం ట్రైబల్ సోదరులతో సమానంగా మేము కూడా ఇక్కడే జీవిస్తున్నాం.మా ఎస్సీ లకు కూడా 100 ఏళ్ల నాటి నుండి భూమి సాగు చేసుకోవడం జరుగుతోంది.ఆ భూములకు వందేళ్ల నాటి నుండి అడంగల్ లు కూడా ఉన్నాయి.

గత రెండు సంవత్సరాల క్రితం వెంకటాపురం మండలంలోని గ్రామ పంచాయతీలలో ఎస్సీ,బీసీ లు తాతల,ముత్తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూములను కొంతమంది ట్రైబల్ వారు తమ పేరు మీద పట్టాలు చేసుకోవడం జరిగింది. అటువంటి అన్యాయం మళ్ళీ జరగకూడదు.

ఇప్పుడు చేసే భూ సర్వేలో ఏ భూమి మీద ఎవరు ఉంటున్నారో,ఆ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, వందేళ్ల నాటి నుండి అడంగల్ ల తో ఉన్న భూములకు కూడా ఎస్సీ లకు పట్టాలు కల్పించాలి. తహసీల్దార్ ఈ సర్వేలో మాకు న్యాయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని అన్నారు.

వెంకటాపురం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల భూ సర్వేను క్షేత్రస్థాయిలో సర్వే చేసి, దళితుల పాత అడంగల్ లను కూడా సర్వే చేసి, తక్షణమే సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు శెట్టిపెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install DEMOCRACY RIGHTS App

Add to home screen for faster loading and latest updates.