| 
Friday, November 13, 2026
Homeతాజా వార్తలుసీజ్ చేసిన గంజాయిని దగ్ధం చేసిన పోలీస్ శాఖ

సీజ్ చేసిన గంజాయిని దగ్ధం చేసిన పోలీస్ శాఖ

📰 Generate e-Paper Clip

డెమోక్రసీ రైట్స్ మహబూబాబాద్, నవంబర్ 12

 

మహబూబాబాద్ జిల్లాలో 19 కేసులకు సంబంధించి సీజ్ చేసిన రూ.49.84 లక్షల విలువైన 99.688 కిలోల డ్రై గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు.ఈగల్ ఆదేశాల మేరకు,ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో,కోర్టు అనుమతితో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలోని AWM Consulting – కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీ వద్ద ప్రత్యేక యంత్రాల ద్వారా దగ్ధం చేశారు. ఈ ప్రక్రియను డీఎస్పీ గండ్రాతి మోహన్, సీఐ ఉపేందర్ పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు.ఎస్పీ డా. శబరీష్ ఆదేశాలతో జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, నిల్వ,విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు.యువత గంజాయికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.గంజాయి సాగు,రవాణా,విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు, అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు.ప్రజలు సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install DEMOCRACY RIGHTS App

Add to home screen for faster loading and latest updates.