| 
Friday, November 13, 2026
Homeతాజా వార్తలుఅఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయండి మానుకోటలో ప్రారంభమైన ప్రచార జాతా

అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయండి మానుకోటలో ప్రారంభమైన ప్రచార జాతా

📰 Generate e-Paper Clip

డెమోక్రసీ రైట్స్ మహబూబాబాద్,నవంబర్,12

 

నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిలభారత కిసాన్ సభ 36వ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గునిగంటి రాజన్న,కోశాధికారి ఆకుల రాజు పిలుపునిచ్చారు. బుధవారం మానుకోట వ్యవసాయ మార్కెట్ నుంచి ప్రచార జాతాను ప్రారంభించారు.దేశవ్యాప్తంగా 1.58 కోట్లకు పైగా సభ్యత్వంతో కిసాన్ సభ ప్రపంచంలోనే అతిపెద్ద రైతాంగ సంస్థగా కొనసాగుతోందని తెలిపారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెభాగా,వర్లీ, పున్నప్ర-వయలార్ పోరాటాల స్ఫూర్తితో రైతుల హక్కుల కోసం పోరాడుతోందన్నారు.రైతులకు గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి ఖర్చులు పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు హామీని నెరవేర్చలేదని విమర్శించారు.కార్పొరేట్ అనుకూల విధానాలు, మతతత్వ రాజకీయాలు రైతుల ఐక్యతను దెబ్బతీస్తున్నాయని అన్నారు.రైతులు, కౌలురైతులు,వ్యవసాయ కార్మికులు,గిరిజనులు, మహిళా రైతులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.గిట్టుబాటు ధర, కనీస వేతనం, భూమి, సామాజిక భద్రత ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు.నవంబర్ 15న లక్షలాది రైతులతో ప్రదర్శన,ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభ జరగనుందని తెలిపారు. నవంబర్ 14న రైతు ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. దేశం నుంచి 1000 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు.జాతా మహబూబాబాద్ నుంచి కేసముద్రం,ఇనుగుర్తి, నెల్లికుదుర్, మహబూబాబాద్ మండలాల్లో ప్రచారం చేస్తుందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install DEMOCRACY RIGHTS App

Add to home screen for faster loading and latest updates.