సీజ్ చేసిన గంజాయిని దగ్ధం చేసిన పోలీస్ శాఖ
డెమోక్రసీ రైట్స్ మహబూబాబాద్, నవంబర్ 12 మహబూబాబాద్ జిల్లాలో 19 కేసులకు సంబంధించి సీజ్ చేసిన రూ.49.84 లక్షల విలువైన 99.688 కిలోల డ్రై గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు.ఈగల్ ఆదేశాల మేరకు,ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో,కోర్టు అనుమతితో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలోని AWM Consulting - కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ వద్ద ప్రత్యేక యంత్రాల ద్వారా దగ్ధం చేశారు. ఈ ప్రక్రియను...