| 
Thursday, November 12, 2026
Homeఆంధ్రప్రదేశ్శ్రీ అద్దేపల్లి ప్రభుత్వ కళాశాలలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

శ్రీ అద్దేపల్లి ప్రభుత్వ కళాశాలలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

డెమోక్రసీ రైట్స్ ప్రతినిధి పాలకొల్లు

పాలకొల్లు స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో తెలుగు మరియు ఆంగ్ల విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి,భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం) వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.డా బూసి వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించబడిన ఈ సదస్సులో ముందుగా అతిథులు ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రత్న మాణిక్యం మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా,దార్శనిక విద్యావేత్తగా ఆజాద్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడుతూ,నేటి విద్యార్థులు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.ఆత్మీయ అతిథిగా పాల్గొన్న రసధుని సాహిత్య సంస్థ అధ్యక్షులు శ్రీ కొట్టే భాస్కరరావు మాట్లాడుతూ ఆజాద్ బహుభాషా కోవిదుడని, సాహిత్యం మరియు జర్నలిజం ద్వారా జాతీయోద్యమానికి ఊపిరిలూదారని గుర్తుచేస్తూ,విద్యార్థులు మాతృభాషాభిమానంతో పాటు ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.సభాధ్యక్షులు డా బూసి వెంకటస్వామి మాట్లాడుతూ ఆధునిక భారతదేశంలో సాంకేతిక, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటుకు ఆజాద్ వేసిన బలమైన పునాదుల వల్లే నేడు భారతదేశం విద్యా రంగంలో అగ్రగామిగా నిలుస్తోందని వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి శ్రీకృష్ణ, అకడమిక్ కోఆర్డినేటర్ శ్రీమతి జి సుమలత, జెకెసి కోఆర్డినేటర్ కె సామ్యూల్, అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వి నరేంద్ర, శ్రీదేవి,పితాని శ్రీనివాసరావు తదితర అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install DEMOCRACY RIGHTS App

Add to home screen for faster loading and latest updates.