గ్రంథాలయాలు విద్యార్థుల ఉన్నతికి సోపానాలు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కరపత్రాలు ఆవిష్కరణ

డెమోక్రసీ రైట్స్ ప్రతినిధి భీమడోలు     గ్రంథాలయాలు విద్యార్థుల విజ్ఞాన వికాసానికి,ఉన్నత భవిష్యత్తుకు సోపానాలని భీమడోలు ఎంఈఓ-1 ఈదుపల్లి శ్రీనివాసరావు అన్నారు.భీమడోలు శాఖా గ్రంథాలయంలో ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను గురువారం ఎంఈఓ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయాల్లో లభించే వివిధ విజ్ఞాన పుస్తకాలను చదవడం ద్వారా తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చన్నారు.వారోత్సవాల్లో విద్యార్థులు,...