DEMOCRACY RIGHTS
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 8:34 am Posted by : DEMOCRACY RIGHTS

గ్రంథాలయాలు విద్యార్థుల ఉన్నతికి సోపానాలు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కరపత్రాలు ఆవిష్కరణ

డెమోక్రసీ రైట్స్ ప్రతినిధి భీమడోలు

 

 

గ్రంథాలయాలు విద్యార్థుల విజ్ఞాన వికాసానికి,ఉన్నత భవిష్యత్తుకు సోపానాలని భీమడోలు ఎంఈఓ-1 ఈదుపల్లి శ్రీనివాసరావు అన్నారు.భీమడోలు శాఖా గ్రంథాలయంలో ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను గురువారం ఎంఈఓ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయాల్లో లభించే వివిధ విజ్ఞాన పుస్తకాలను చదవడం ద్వారా తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చన్నారు.వారోత్సవాల్లో విద్యార్థులు, యువత,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా ఉపాధ్యాయులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని పఠనాసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ జిల్లా డైరెక్టర్ తుమ్మల ఉమా మహేశ్వరరావు,భీమడోలు గ్రంథపాలకుడు కె. శ్రీనివాసరావు,సీఆర్‌పీసి. రమణ తదితరులు పాల్గొన్నారు.